Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డాక్టర్లు షాక్... ఆరేళ్ల బాలుడికి గర్భం, ఎలా సాధ్యం?

శనివారం, 2 డిశెంబరు 2017 (14:33 IST)

Widgets Magazine
Baby

వారణాసిలో షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల బాలుడు గర్భం ధరించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే... వారణాసిలో నివాసముంటున్న ఓ కుటుంబం తమ ఆరేళ్ల బాలుడు తరచూ కడుపునొప్పితో బాధపడటాన్ని గమనించారు. వైద్యుల వద్దకు తీసుకుని వెళితే ఏవేవో మందులు రాసిచ్చారు. వాటిని తీసుకున్నప్పటికీ బాలుడిలో మార్పు రాలేదు. పైగా పొట్ట భాగం కాస్త పెద్దదిగా మారడం కనిపించింది. దీనితో నిపుణులైన వైద్యుల వద్దకు తీసుకుని వెళ్లారు. 
 
ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు, బాలుడి కడుపులో గడ్డ వున్నదనీ, శస్త్ర చికిత్స చేసి తీసేయాలని చెప్పారు. బాలుడి తల్లిదండ్రులు అన్నీ సిద్ధం చేసుకుని బాలుడిని ఆపరేషన్‌కు తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స మొదలుపెట్టిన వైద్యులు పిల్లవాడికి ఆపరేషన్ ప్రారంభించి లోపల వున్న శిశువు పిండాన్ని చూసి షాక్ తిన్నారు. దాదాపు 2 గంటల పాటు ఆపరేషన్ చేసి పిండాన్ని తొలగించారు. 
 
బాలుడు గర్భం ధరించడమేమిటని అతడి తల్లిదండ్రులు వైద్యులను నిలదీశారు. దీనికి వారు సమాధానమిస్తూ... ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయనీ, తల్లి గర్భంతో వున్నప్పుడు ఈ బాలుడితోపాటు మరో పిండం కూడా ఏర్పడిందని తెలిపారు. ఐతే ఆ పిండం ఎదుగుదలలో తేడాలు రావడంతో అలాగే వుండిపోయి చివరికి ఆరోగ్యంగా ఎదిగిన మరో పిండం లోపలికి వెళ్లిపోయిందని అన్నారు. అలా ఏడేళ్ల కిందట ఈ పిల్లవాడు జన్మించాడని చెప్పారు. తొలుత దీన్ని అంగీకరించకపోయినా, గతంలో జరిగిన ఘటనలను వైద్యులు వారి ముందు వుంచేసరికి ఒప్పుకోక తప్పలేదు మరి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జుకర్ బర్గ్ సోదరికి విమానంలో వేధింపులు.. 3 గంటల పాటు భరించిందట..

ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సోదరి విమానంలో మూడు గంటల పాటు వేధింపులకు ...

news

అమిత్ షా హిందువు కాదు.. రాహుల్ గాంధీ శివారాధన చేస్తారు: బబ్బర్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మత గొడవలు ప్రారంభమైనాయి. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ...

news

ఎమ్మెల్యేలు పందికొక్కులా.. జగనే ఓ పెద్ద పంది కొక్కు: సోమిశెట్టి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను పందికొక్కులు అంటూ తీవ్ర ...

news

ట్రిపుల్ తలాఖ్‌ చెప్తే మూడేళ్ల జైలు.. కొత్తబిల్లు..

ట్రిపుల్ తలాఖ్‌పై ముస్లిం మ‌హిళ‌ల్లో వ్య‌తిరేక‌త రోజురోజుకూ పెరిగిపోతున్న‌ది. ఈ సామాజిక ...

Widgets Magazine