ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 నవంబరు 2022 (18:52 IST)

తాగిన మైకం.. కొండచిలువను మెడలో వేసుకున్నాడు.. చుక్కలు కనిపించాయ్!

snake
snake
తాగిన మత్తులో కొండచిలువను మెడలో వేసుకుని నానా హంగామా చేశాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని గర్వాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మత్తులో వున్న 55 ఏళ్ల బిర్జాలాల్ రామ్ భుయాన్... ఖుర్ద్ గ్రామం అన్నరాజ్ డ్యామ్ వద్దకు వెళ్లాడు. కాలువ లోతులేదని నీటిలో చేపలు పట్టడానికి వెళ్లాడు. 
 
కానీ అతడి కళ్లు కొండచిలువపై పడింది. ఆ పామును చేప అనుకున్నాడు. పామును పట్టుకుని మెడకు వేసుకోవడంతో తాగుబోతుకు చుక్కలు కనిపించాయి. మెడకు బిగించింది కొండచిలువ. దీంతో వదిలించుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. నొప్పితో అరవడం ప్రారంభించాడు. 
 
దీంతో అతడి కుమారుడు, స్నేహితులు అక్కడకు చేరుకుని అతనిని 20 నిమిషాల పోరాటం తర్వాత కాపాడారు. ఈ ఘటనలో బీర్జాలాల్‌కు గాయాలైనాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.