అత్యంత విషమం... కరుణానిధి ఆరోగ్యంపై లేటెస్ట్ మెడికల్ రిపోర్ట్

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఆయన ఆరోగ్యం చికిత్సకు ఏమాత్రం స్పందించడం లేదని కావేరీ ఆస్పత్రి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేసిన వైద్య బులిటెన్‌లో పేర్కొంది.

karuna medical report
pnr| Last Updated: మంగళవారం, 7 ఆగస్టు 2018 (17:02 IST)
డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఆయన ఆరోగ్యం చికిత్సకు ఏమాత్రం స్పందించడం లేదని కావేరీ ఆస్పత్రి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేసిన వైద్య బులిటెన్‌లో పేర్కొంది. ముఖ్యంగా, కొన్ని గంటలుగా పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు పేర్కొంది. దీంతో డీఎంకే కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
 
కాగా, వృద్ధాప్యం కారణంగా కరుణానిధి శరీరంలోని అంతర్గత అవయవాలు చికిత్సకు స్పందించడం లేదు. దీంతో ఆయన పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ డీఎంకే కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. కరుణానిధి ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కావేరి ఆసుపత్రి బయట పోలీసులు భారీగా మొహరించారు. దీనిపై మరింత చదవండి :