ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (07:25 IST)

మహారాష్ట్ర మంత్రి ధనుంజయ ముండే నన్ను రేప్ చేశారు.. రేణు శర్మ

Renu sharma
మహారాష్ట్ర మంత్రి ధనుంజయ ముండే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని సింగర్ రేణు శర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహారాష్ట్ర సీఎం కేబినేట్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. మంత్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడని మహారాష్ట్ర పోలీస్ కమీషనర్ పరంభీర్ సింగ్‌కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. వెంటనే మంత్రి ధనుంజయ ముండేపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. 
 
అయితే గతంలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సింగర్ రేణు శర్మ వెల్లడించారు. రేణు శర్మ ఓషివోరా అనే పోలీస్ స్టేషన్ లో మంత్రి ధనుంజయ ముండే లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
 
అయితే ఈ నెల 10న పోలీస్ స్టేషన్‌లో వెళ్లి ఫిర్యాదు చేస్తే.. ఇప్పటి వరకు కంప్లైంట్ తీసుకోలేదని రేణు శర్మ ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. ఆమె ఫైల్ చేసిన కంప్లైంట్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అంతేకాకుండా తన ప్రాణానికి ముప్పు ఉందని.. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంలో సహాయం చేయాలని ఆమె కోరారు. మోడీతో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌ను కూడా ఈ విషయంలో సహాయం చేయాలని కోరారు