ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (11:58 IST)

హాయిగా నిద్రపోయింది.. రూ.5 లక్షల రివార్డు గెలుకుంది.. ఎక్కడ?

sleeping champion
సాధారణంగా నెల వేతనాన్ని సంపాదించేందుకు ఎంతో శ్రమించాల్సివుంటుంది. నెలలో 30 రోజుల పాటు విధులకు హాజరైతేనే కంపెనీ యజమాని జీతం ఇస్తారు. ఒక్కోసారి రోజుకు పది నుంచి 12 గంటలైనా పని చేయాల్సివుంటుంది. అయితే ఈ యువతి మాత్రం హాయిగా కంటి నిద్ర పోయి ఏకంగా ఐదు లక్షల రూపాయలను గెలుచుకుంది. ఆ యువతి పేరు త్రివర్ణ చక్రవర్తి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. మంచం దిగకుండా, కాలు భూమిపై పెట్టకుండా రూ.5 లక్షలు గెలుచుకుంది. ఆమె చేసిన పనంతా హాయిగా కంటి నిద్ర పోవడమే. పలితంగా భారత తొలి స్లీప్ చాంపియన్‌గా అవతరించింది. 
 
నిద్రపోతే రూ.5 లక్షల నగదు బహుమతి ఎలా ఇస్తారన్నదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. వేక్ ఫిట్. ఇదొక పరుపుల తయారీ సంస్థ. నిద్ర ప్రోత్సహించడమే ఈ కంపెనీ ముఖ్యోద్దేశం. స్లీప్ ఇంటర్న్‌షిప్ పేరుతో ప్రతి యేటా ఓ పోటీని నిర్వహిస్తుంది. ఇందుకోసం లక్షల కొద్దీ అందిన దరఖాస్తులను పరిశీలించి 15 మందిని ఇంటర్న్‌షిప్ కోసం ఎంపిక చేసింది. 
 
వీరికి ఒక పరుపుతో పాటు స్లీప్ ట్రాకర్ ఇస్తారు. వాటిని ఉపయోగించుకుని ఎవరింట్లో వాళ్లు వరుసగా వంద రోజులు, రోజుకు 9 గంటలపాటు ఎలాంటి అంతరాయం లేకుండా సుఖంగా నిద్రపోవడమే. ఇలా వాళ్ల నిద్ర నాణ్యతను పరిశీలించి నలుగుని ఫైనల్స్‌కు ఎంపిక చేస్తారు. వీరిలో ఒకరిని విజేతగా ప్రకటిస్తారు. 
 
గరిష్టంగా రూ.10 లక్షల వరకు నగదు బహుమతిని గెలుచుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో గత యేడాది నిర్వహించిన రెండో సీజన్ పోటీల్లో 95 శాతం నిద్రలో నాణ్యత సాధించిన కోల్‌‍కతాకు చెందిన త్రిపర్ణ చక్రవర్తి రూ.5 లక్షల నగదు బహుమతిని గెలుచుకుంది. అలా ఇండియన్ తొలి స్లీప్ ఛాంపియన్‌గా నిలిచింది. మిగిలిన ముగ్గురికి రూ. లక్ష చొప్పున నగదు బహుమతి ఇచ్చారు.