శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 నవంబరు 2020 (10:11 IST)

సైకిలెక్కిన సోనియమ్మ

ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా గోవాలో విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ గోవాలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌ ఆవరణలో సైకిల్‌ తొక్కుతూ హల్‌చల్‌ చేశారు.

దీర్ఘకాలంగా ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియా గాంధీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. ఢిల్లీ కాలుష్యం ఆమె అనారోగ్యాన్ని మరింత తీవ్రతరం చేయడంతో హస్తినకు దూరంగా ఉండాలని వైద్యులు ఆమెకు సూచించారు.

ఈ క్రమంలోనే సోనియా గాంధీ గోవాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గోవాలో ఆమె వ్యాయామాలతోపాటు సైక్లింగ్‌ కూడా చేస్తున్నారు. సైక్లింగ్‌తోపాటు జాగింగ్‌ చేశారు.