శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (14:06 IST)

సోనియా ఆరోగ్యం మెరుగు... వైద్యులు వెల్లడి...!

శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న సోనియాగాంధీ ఆరోగ్యం కొంత మెరుగైంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గురువారం స్వల్ప అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరారు. 
 
ఈ విషయమై సోనియా వైద్యం పొందుతున్న న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ సోనియా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చినట్టు తెలిపారు. ఆమెకు ఊపిరితిత్తుల మార్గంలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ కాస్త తగ్గుముఖం పట్టిందన్నారు. తర్వారా సోనియా ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు వారు వెల్లడించారు. 
 
కాగా గతంలో కేన్సర్ బారిన పడిన సోనియాగాంధీ.. అమెరికాలోని ఓ ప్రఖ్యాత ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఆమె వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లి వస్తుంటారు.