గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జులై 2023 (17:56 IST)

మహిళా రైతులతో కలిసి సోనియా గాంధీ డ్యాన్స్..

Sonia Gandhi
Sonia Gandhi
హర్యానాకు చెందిన మహిళా రైతులతో కలిసి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
ఈ మహిళా రైతులు జూలై 8న హర్యానాలోని సోనేపట్‌లోని మదీనా గ్రామంలో వరి పొలాలను సందర్శించినప్పుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో సంభాషించారు. 
 
రాహుల్ గాంధీ హర్యానాలోని సోనేపట్‌లోని మదీనా గ్రామంలో వరి పొలాలను సందర్శించినప్పుడు, కొందరు ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లాలని మహిళా రైతులు ఆకాంక్షించారు. 
 
మహిళా రైతులను సోనియా కుటుంబం సాదరంగా ఆహ్వానించారు. వారికి ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేయడమే గాక.. సోనియా, ప్రియాంక గాంధీ కూడా మహిళలతో కలిసి భోజనం చేశారు. 
 
అనంతరం వారితో సరదాగా ముచ్చటించారు. మహిళా రైతులు సోనియాను నృత్యం చేయాలని కోరగా.. అందుకు ఆమె అంగీకరించి వారితో కలిసి స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.