బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 జూన్ 2021 (18:56 IST)

సోనూసూద్ సంభవం: సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకునే వారికి అండ...!

Sonu Sood
కరోనా కాలంలో పేదలకు, వలస కార్మికులకు అండగా నిలిచిన బాలీవుడ్ హీరో సోనూసూద్ తాజాగా తన సేవలను విస్తరిస్తున్నారు. మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్యను సోనూ అందిస్తున్నారు. ఇందుకోసం ఈ నెల ప్రారంభంలో, అతడు పంజాబ్ లోని సిటీ విశ్వవిద్యాలయంతో కలిసి తన సహకారాన్ని ప్రకటించారు. 
 
ఇ-రిక్షాలు, ఉపాధి కోల్పోయిన వారికి సహాయం అందించడం, వైద్య చికిత్స అందించడంతో పాటు సోనూ అనేక వేదికలను ప్రారంభించారు. తాజాగా సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకునే వారికి అండగా నిలవాలనుకుంటున్నారు సోనూ. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఎఎస్) పరీక్షకు సన్నద్ధులయ్యే వారికి ఉచితంగా కోచింగ్ తీసుకునేందుకు స్కాలర్‌షిప్ ప్రకటించారు. 
 
ఇందులో భాగంగా ఐఎఎస్ కోసం సిద్ధం కావాలనుకుంటే, ఆ బాధ్యతను తాము తీసుకుంటామని సోనూ ట్వీట్ చేశారు. ఇందుకోసం "సంభవం"ను ప్రారంభిస్తున్నాం. అభ్యర్థులు జూన్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వెబ్‌సైట్ వివరాలను ఆ ట్వీట్‌లో పొందుపరిచారు.