శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శుక్రవారం, 21 జులై 2017 (06:55 IST)

జీవితంలో తొలిసారి క్యాబ్ బుక్ చేశాడు. ఏకంగా కిడ్నాపై చెరుకుతోటల్లో పడ్డాడు

ఢిల్లీ జీవితంలో తొలిసారి క్యాబ్ బుక్ చేసుకుని తొలిసారే ఏకంగా కిడ్నాప్ కావటం శ్రీకాంత్ వంతు అయితే అతడిని కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ అంతకు రెండు రోజుల క్రితమే ఓలా సంస్థకు తన నకిలీ ధ్రువపత్రాలు సమర్పి

తెలంగాణకు చెందిన  వైద్య విద్యార్థి శ్రీకాంత్‌గౌడ్‌ ఢిల్లీలో కిడ్నాప్‌‌కు గురైన వ్యవహారం వివరాలు తెలిసే కొద్దీ రాత్రి పూట క్యాబ్ బుక్ చేయడం కూడా మన దేశంలో ప్రమాదరమేనని, ఏమీ తెలీని అమాయక ప్రయాణికులకు కూడా ప్రాణాలమీదకు తెస్తుందని బోధపడుతోంది. ఎయిమ్స్‌లో రాత్రిపూట డ్యూటీ ముగించుకుని తన నివాసాన్ని చేరడానికి మెట్రో రైలును మాత్రమే ఉపయోగించుకునే శ్రీకాంత్ జూలై 6న రాత్రి 11 గంటల వేళ మెట్రో మిస్సవడంతో జీవితంలోనే తొలిసారి క్యాబ్ బుక్ చేసుకున్నందుకు 13 రోజులపాటు నరకం అనుభవించాల్సి వచ్చింది. 
 
ఢిల్లీ జీవితంలో తొలిసారి క్యాబ్ బుక్ చేసుకుని తొలిసారే ఏకంగా కిడ్నాప్ కావటం శ్రీకాంత్ వంతు అయితే అతడిని కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ అంతకు రెండు రోజుల క్రితమే ఓలా సంస్థకు తన నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి క్యాబ్ సర్వీసు నడపడానికి లైసెన్స్ తీసుకున్నాడు. ఈ రెండు ఘటనలు కాకతాళీయమే కావచ్చు కానీ ఢిల్లీలో మగాళ్లు లేటు నైటులో ప్రయాణించడం కూడా ప్రాణాల మీదకు వస్తుందని బోధపడింది.
 
శ్రీకాంత్‌ ఈ నెల 6న ఆస్పత్రిలో విధులు ముగించుకుని, ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో ఓలా క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాడు. ఎవరినైనా కిడ్నాప్‌ చేసి, ఓలా యాజమాన్యం నుంచి డబ్బులు డిమాండ్‌ చేయాలన్న ఆలోచనతో ఉన్న సుశీల్‌ క్యాబ్‌కు ఆ బుకింగ్‌ వచ్చింది. దీంతో శ్రీకాంత్‌ను ప్రీత్‌విహార్‌ మెట్రోరైలు స్టేషన్‌లో ఎక్కించుకున్న సుశీల్‌.. తన అనుచరులున్న ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ మరో కారులో ఉన్న సుశీల్‌ తమ్ముడు అనుజ్, అతడి బావమరిది ప్రమోద్, స్నేహితులు సోన్‌వీర్, అమిత్, వివేక్‌లు కలసి కిడ్నాప్‌ చేశారు. క్యాబ్‌లో ఉన్న జీపీఎస్‌ను, వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను స్విచాఫ్‌ చేసేశారు. 
 
శ్రీకాంత్‌ ఫోన్‌ నుంచే ఓలా యాజమాన్యానికి ఫోన్‌ చేసి.. శ్రీకాంత్‌ను కిడ్నాప్‌ చేశామని, రూ.5 కోట్లు ఇస్తేనే వదిలేస్తామని డిమాండ్‌ చేశారు. శ్రీకాంత్‌ కిడ్నాప్‌పై ఓలా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... రూ.5 కోట్లు ఇస్తామని, శ్రీకాంత్‌కు ఎలాంటి హానీ తలపెట్టవద్దంటూ సంప్రదింపులు ప్రారంభించారు. ఇదే సమయంలో కిడ్నాపర్లను ట్రాక్‌ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత కిడ్నాపర్ల నుంచి ఫోన్లు రావడం ఆగిపోయింది. శ్రీకాంత్‌ను తీసుకుని దాదాపు 13 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిరిగిన కిడ్నాపర్లు.. ఆదివారం ముజఫర్‌నగర్‌ పరిసరాల్లోని చెరుకు తోటల్లోకి వచ్చారు.
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లగా.. కిడ్నాపర్లు పోలీసులపై కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు. అక్కడి నుంచి కిడ్నాపర్లు మీరట్‌లోని శతాబ్దినగర్‌కు వెళ్లారని బుధవారం ఉత్తరప్రదేశ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు లు శ్రీకాంత్‌ను ఉంచిన ఇంటిని చుట్టుముట్టారు. కొందరు సిబ్బంది ఇంట్లోకి వెళ్లి శ్రీకాంత్‌ను బయటకు తెచ్చేందుకు ప్రయత్నించగా.. కిడ్నాపర్లు మరోసారి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. మొత్తానికి పోలీసులు శ్రీకాంత్‌ను క్షేమంగా కాపాడి.. కిడ్నాపర్ల బృందంలోని సోన్‌వీర్, అమిత్, ప్రమోద్, గౌరవ్‌శర్మలను అరెస్టు చేశారు. వీరిలో ప్రమోద్‌కు బుల్లెట్‌ గాయాలయ్యాయి. ప్రధాన నిందితుడు సుశీల్, అనుజ్, వివేక్‌ల కోసం గాలిస్తున్నారు.
 
కాగా తమ సంస్థతో క్యాబ్‌ అటాచ్‌మెంట్‌ కోసం సుశీల్‌ తప్పుడు పత్రాలు సమర్పించాడని.. ఆ విషయా న్ని గుర్తించడంలో తాము విఫలమయ్యామని ఓలా సంస్థ అంగీకరించింది. ఓలా సంస్థకు క్యాబ్‌లను అటాచ్‌ చేసే ఏజెంట్‌ ద్వారా నకిలీ పత్రాలు సమర్పించిన సుశీల్‌.. ఈ నెల 4వ తేదీ నుంచి క్యాబ్‌ సర్వీసు లు ప్రారంభించి, 6వ తేదీన శ్రీకాంత్‌ను కిడ్నాప్‌ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఘటన జరిగిన మరుసటి రోజు నుంచే దేశవ్యాప్తంగా క్యాబ్‌ల అటాచ్‌మెంటును నిలిపివేశామని... అటాచ్‌మెంట్‌కు ఉన్న నిబంధనల్లో ఎక్కడ లోపం ఉందో పరిశీలిస్తున్నామని ఓలా సంస్థ కార్పొరేట్‌ వ్యవహారాల చీఫ్‌ బండార్కర్‌ తెలిపారు.