శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (13:05 IST)

వన్ నేషన్ - వన్ రేషన్ కార్డు : రాష్ట్రాలకు సుప్రీం కీలక ఆదేశాలు

వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంశంపై అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ పథకాన్ని అన్ని రాష్ట్రాలు విధిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అదీకూడా వచ్చే నెల 31వ తేదీలోపు ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టాలని ఆదేశాలిచ్చింది. 
 
వలస కార్మికులు ఎక్కడైనా రేషన్ తీసుకునేందుకు పేర్లను నమోదు చేసుకునేలా ఓ పోర్టల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పథకంతో వలస కార్మికులు తాము పనిచేసే చోటే రేషన్‌ను తీసుకునే వీలు కలుగుతుందని చెప్పింది.
 
అంజలి భరద్వాజ్, హర్ష్ మందర్, జగ్ దీప్ ఛొకర్‌లు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం మంగళవారం విచారణ చేసింది. కరోనాతో ఆర్థికంగా బాగా చితికిపోయిన వలస కార్మికుల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు పలు ఆదేశాలు ఇచ్చింది.