శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (18:21 IST)

ఇక రైలు చార్జీలు భారమే!

ఇకపై చార్జీల మోత మోగనుంది. దశాబ్దాల చరిత్ర గల రైల్వే సంస్థలతో పాటు చార్జీల విధించే అధికారాన్ని కూడా మోడీ సర్కార్‌ ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టింది.

రైల్వే చార్జీల వసూలుపై పూర్తి అధికారం ప్రైవేట్‌ సంస్థలదేనని రైల్వేబోర్డ్‌ చైర్మన్‌ వికె.యాదవ్‌ శుక్రవారం ప్రకటించారు. అయితే చార్జీలు వసూలు చేసే సమయంలో... ఎసి బస్సులు తిరిగే రూట్లను ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు.

అల్‌స్టామ్‌ ఎస్‌ఎ, బాంబర్‌డైర్‌ ఇంక్‌, జిఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌, అదానీ సంస్థలు ఈ ప్రాజెక్టుల కోసం పోటీపడుతున్నాయని యాదవ్‌ అన్నారు.