సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 మే 2022 (13:29 IST)

ఢిల్లీలో భారీ వర్షాలు.. బలమైన గాలులు..

Rains
ఢిల్లీలో భారీ వర్షాలు జనాలను వణికించాయి. గంటన్నరపాటు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సేవలకు విఘాతం ఏర్పడగా.. విద్యుత్ ప్రసారం కూడా నిలిచిపోయింది. భానుడి భగభగలకు ఉడికిపోతున్న ఢిల్లీ ఒక్కసారిగా కూల్‌‌గా మారిపోయింది. మరిన్ని వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 
 
పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా.. కొన్ని చోట్ల గోడలు కూలిపోయినట్టు ప్రాథమిక సమాచారం. 50-80 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు వీస్తాయని, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఢిల్లీ వాసులకు సూచించింది. బలమైన గాలుల ప్రభావానికి బలహీనంగా ఉన్న నిర్మాణాలు కూలే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది.