గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (10:53 IST)

కాలేజీ విద్యార్థుల కిస్సింగ్ కాంపిటిషన్... తన్మయత్నంలో మునిగిపోయిన జంట

bride kiss
కర్నాటక రాష్ట్రంలోని మంగుళూరులో ప్రముఖ కాలేజీలో ఓ జంట ఒక అపార్టుమెంటులో ముద్దుల్లో మునిగిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాలేజీ యూనిఫామ్స్‌లో ఉన్న వారిద్దరూ ముద్దు పెట్టుకుంటూ తన్మయత్నంలో మునిగిపోయారు. పైగా, వారి చుట్టూత ఉన్న స్నేహితులు కేకలు వేస్తూ, చప్పట్లు కొడుతూ వారిని మరింతగా ప్రోత్సహిస్తున్నారు. ఈ వీడియో పోలీసుల కంటపడటంతో దాని గురించి ఆరా తీసి, ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
దీనిపై మంగుళూరు పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ స్పందించారు. ఈ వీడియో ఇప్పటిదికాదని, ఆరు నెలల క్రితం నాటిదని చెప్పారు. ఈ వీడియోనే వారం రోజులుగా ఓ యువకుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నాడని చెప్పారు. అయితే, ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు లేదా కాలేజీ యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. 
 
కిస్సింగ్ కాంపిటిషన్ సందర్భంగా విద్యార్థులు ఏదైనా డ్రగ్స్ ఉపయోగించారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కాలేజీ యాజమాన్యం ముద్దుల్లో మునిగితేలిన విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన వారిని కాలేజీ నుంచి తొలగించింది.