మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (11:54 IST)

పోలీసుల అదుపులో నేతాజీ సుభాష చంద్రబోస్ మనవరాలు

radhika choudhary bose
భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవరాలు రాజ్యశ్రీ చౌదరి బోస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానవాపి మసీదులో ఆమె పూజలు చేసేందుకు వెళ్లడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రైలులో వారణాసికి బయలుదేరిన రాజ్యశ్రీని ప్రయాగ్‌రాజ్ వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, ఆమె అఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. దీనిపై ఆమె గతవారం ఓ ప్రకటన చేశారు. జ్ఞానవాపి మసీదు వద్ద జలాభిషేకం చేస్తానని అందులో పేర్కొన్నారు. అయితే, దీనికి అనుమతి లేదని స్థానిక పోలీసులతో పాటు అధికారులు వెల్లడించారు. 
 
అయినప్పటికీ ఆమె ముందుగా ప్రకటించినట్టుగా మసీదులో జలాభిషేకం చేసేందుకు రైలులో బయలుదేరారు. దీన్ని తెలుసుకున్న పోలీసులు ఆమెను ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకుని నిర్బంధించాయి. ప్రస్తుతం ఆమెను గృహనిర్బంధంలో ఉంచారు.