1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (17:30 IST)

ఒబామా నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది : సుబ్రమణ్య స్వామి

మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధినేత బరాక్ ఒబామా నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం మాట్లాడుతూ భారత మతసహనం పైన ఒబామా ఉపన్యాసం ఇవ్వరాదన్నారు. ఒబామా పనేదో ఆయన చూసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. అమెరికాలో రెండు మిలియన్ల మంది భారతీయులు ఉన్నారని, అక్కడ వారు దేవాలయాలు నిర్మించుకునేందుకు అనుమతించరని, దీపావళి జరుపుకునేందుకు అనుమతించరని విమర్శించారు.
 
కానీ, ఇక్కడ బరాక్ ఒబామా మాత్రం ఉపన్యాసాలు ఇస్తారని ఎద్దేవా చేశారు. అమెరికాలో మతసామరస్యం సాధించామని చెప్పడం విడ్డూరమన్నారు. అమెరికాలో మెజార్టీ ప్రజలు హిందువులను పశువుల కన్నా హీనంగా చూస్తారని, భారత దేశంలో అయితే ఎనిమిది వందల ఏళ్లుగా ఇస్లామిక్ మైనార్టీ వర్గం, ఆ తర్వాత క్రిస్టినయ్లు మెజార్టీ హిందువులను వేధిస్తున్నారని స్వామి గుర్తు చేశారు.