శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 ఆగస్టు 2017 (06:57 IST)

శశికళకు విముక్తి లేనట్టే.. పూర్తి కాలం జైలుశిక్ష అనుభవించాల్సిందేనట...

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె శిక్ష పడగా, ఆ శిక్షను బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో అనుభవిస్తున్నారు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె శిక్ష పడగా, ఆ శిక్షను బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో అనుభవిస్తున్నారు. 
 
అయితే, ఈ కేసులో తుదితీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. శశికళతో పాటు, ఆమె అక్క కుమారుడు సుధాకరన్‌, ఆమె వదిన ఇళవరిసి ఈ ఏడాది మే నెలలో ఈ రివ్యూ పిటిషన్‌‌ను దాఖలు చేశారు. 
 
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ దోషిగా పేర్కొంటూ ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం చేత రాజీనామా చేయించి, పార్టీ పగ్గాలు చేపట్టిన కొన్ని రోజులకే సుప్రీం తీర్పు రూపంలో ఆమెకు శరాఘాతం తగిలింది.