సోమవారం, 28 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (13:25 IST)

'లొంగిపో బిడ్డా... అందరం ప్రశాంతంగా బతుకుదాం' : ఉగ్రవాది కొడుక్కి తల్లి పిలుపు

terrorist
కాశ్మీర్‌లోయలోని పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన నరహంతకుల్లో తన కొడుకు ఉంటే అతడిని అదేచోట కాల్చి చంపేయాలని ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ తల్లి షాజాదా బానో భద్రతా బలగాలకు విజ్ఞప్తి చేశారు. అలాగే, ప్రాణాలతో జీవించివుంటే పోలీసులకు లొంగిపోవాలంటూ తన కుమారుడుకి ఆమె సూచించారు. 'లొంగిపో బిడ్డా... అందరం ప్రశాంతంగా బతుకుదాం' అంటూ మీడియా ద్వారా కొడుకుకు విజ్ఞప్తి చేశారు. 
 
ఉగ్రదాడి తర్వాత ఆదిల్‌ను వెతుక్కుంటూ భద్రతా బలగాలు తల ఇంటికి రావడం, సోదాలు జరిపి ఇంటిని కూల్చేయడంపై షాజాద్ స్పందించారు. 2018లో పరీక్ష రాసివస్తానని వెళ్లిన ఆదిల్ ఇప్పటివరకూ రాలేదని చెప్పారు. అప్పట్లో ఆదిల్ కనిపించిడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. ఉగ్రదాడి చేసిన ఉగ్రవాదుల్లో తన కొడుకు ఉండకపోవచ్చని అన్నారు. అధికారులు విడుదల చేసిన స్కెస్‌‍లు తన కుమారుడు పోలికలతో సరిపోలడం లేదన్నారు. ఆదిల్ శ్రద్ధగా చదువుకునేవాడని స్థానికులు చెబుతున్నారు. 
 
కాగా, గత 2018లో ఆదిల్ పాకిస్థాన్‌కు వెళ్ళాడని, స్టడీ వీసాపై అక్కడికి వెళ్లి ఉగ్రవాదులతో కలిశాడని నిఘా వర్గాలు చెబుతున్నారు. 2024లో ఎల్వోసీ రేఖ ద్వారా తిరిగి భారత్‌లోకి ప్రవేశించివుంటాడని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిల్ కండ్రి వలీమ్ మొహ్మద్ థోకర్, సోదరులు జహీర్, అర్ష్‌లామ్, కజిన్‌లు జులాంకర్, సజ్జాద్‌లను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. తమ భర్త, కుమారులు నిర్బంధంలో ఉన్నారని, ఇల్లు కూలిపోయిందని ఇపుడు తన పరిస్థితి ఏమిటని షాజాదా బానో విలపించారు.