శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 మే 2017 (17:51 IST)

పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ రికార్డు.. వెనుక ఎవరున్నారో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాల్లో స్వచ్ఛభారత్ ఒకటి. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో అన్ని రాష్ట్రాలు స్వచ్ఛభారత్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్త

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాల్లో స్వచ్ఛభారత్ ఒకటి. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో అన్ని రాష్ట్రాలు స్వచ్ఛభారత్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. దేశంలోనే పరిశుభ్రమైన నగరాల జాబితాను కేంద్రం ప్రకటించింది. 
 
ఇందులో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఇటీవల రికార్డుకెక్కింది. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ నిలిచింది. ఈ రికార్డు వెనక ఓ తెలుగు అధికారి ఉన్నారు. ఆయన పేరు పరికిపండ్ల నరహరి. ఇండోర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న నరహరి ‘లాడ్లీ లక్ష్మీ యోజన’లాంటి అద్భుత పథకానికి రూపకర్త కూడా. సమర్థమైన, నిజాయతీగల ఐఏఎస్‌గా పేరు సంపాదించుకున్నారు. 
 
ఇంతకీ ఈయన పుట్టింది మన తెలంగాణ రాష్ట్రంలో. కరీంనగర్‌ జిల్లా, రామగుండం మండలం, బసంత్‌ నగర్‌లో జన్మించారు. ఈయన తండ్రి టైలర్‌. వరంగల్‌ జిల్లా నుంచి అక్కడికి ఉపాధి కోసం వచ్చారు. ఎంతో కష్టపడి ఐఏఎస్ అయ్యారు. ఆ తర్వాత ఇండోర్ కలెక్టర్‌‍గా పని చేస్తున్నారు.