గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (09:41 IST)

మద్యంమత్తులో అసభ్యంగా ప్రవర్తించిన వరుడు.. పెళ్లి రద్దు చేసిన వధువు .. ఎక్కడ?

marriage
పీకల వరకు మద్యం సేవించిన వరుడు ఒకడు తనకు కాబోయే భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన వధువు పెళ్లిని రద్దు చేసుకుంది. బంధువులు ఎంతగా సర్ధిచెప్పినా ఆమె మాత్రం పట్టు వీడిలేదు. ఫలితంగా ముహూర్తానికి కొన్ని గంటల ముందు అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి రద్దు అయింది. ఇది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో జరిగింది. 
 
కంచీకి చెందిన లక్ష్మీనరసింహన్ అనే వరుడికి చెంగల్పటు జిల్లాకు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. సోమవారం వివాహ మూహుర్తం జరగాల్సివుండగా ఆదివారం రాత్రి వరుడు తన స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీలో పీకల వరకు మద్యంసేవించిన వరుడు... తనతో పాటు వచ్చిన బంధువుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. 
 
ఇలాంటి తాగుబోతుకుని కట్టుకుంటే తన జీవితం కష్టాలపాలవుతుందని భయపడిన యువతి తనకు ఈ పెళ్లి వద్దంటూ ఇంటికి వెళ్లిపోయింది. దీంతో పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. పైగా, వరుడి నిర్వాకంతో ఆగ్రహించిన పెళ్ళి కుమార్తె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో పోలీసులు వచ్చి కళ్యాణ మండపానికి వెళ్లి చూడగా వరుడు తప్పతాగిన స్థితిలో కనిపించాడు. దీంతో పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్టు వధువు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పైగా, తాము వరుడికి కానుకగా ఇచ్చిన బంగారు గొలుసు, బంగారు ఉంగరం, రోల్డ్ గోల్డ్ వాచీ వంటి వస్తువులను కూడా వధువు కుటుంబ సభ్యులు వెనక్కి తీసుకున్నారు.