కరోనా అనుమానితుడు.. ప్రేయసి కోసం అలా పారిపోయాడు.. చివరికి?  
                                       
                  
				  				   
				   
                  				  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. దేశంలోనూ లాక్ డౌన్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో తమిళనాట ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కరోనాలో భాగంగా ముందస్తు జాగ్రత్తలు నిర్వహిస్తున్నారు వైద్యులు. అలా మధురై ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కొన్నిరోజుల కిందట దుబాయ్ నుంచి వచ్చాడు. కానీ కరోనా ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో ఆ యువకుడ్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. 
				  											
																													
									  
	 
	అప్పటికే ఆ యువకుడు శివగంగకు చెందిన ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. వారి ప్రేమకు అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే, క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ఆ యువకుడు ప్రేయసిని వీడి వుండలేకపోయాడు. అంతే ప్రియురాలిని చూసేందుకు పరుగులు పెట్టాడు. 
				  
	 
	ఇందులో భాగంగా క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయాడు. దాంతో వైద్య సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించి అతడి కోసం గాలింపు చేపట్టారు. అలా ప్రియురాలి ఇంట్లో వున్న అతడిని గుర్తించారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	అతడు కరోనా అనుమానితుడు కావడంతో ఆయువతిని కలిసిన నేపథ్యంలో ఆమెకు కూడా కరోనా సోకుతుందేమోనన్న అనుమానంతో ఇద్దరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అంతేకాదు, క్వారంటైన్ నియమావళి ఉల్లంఘించాడంటూ ఈ యువకుడిపై కేసు నమోదు చేశారు.