శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 మే 2020 (13:36 IST)

తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త - అదనంగా మరో యేడాది...

ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 యేళ్ళు. దీన్ని మరో యేడాది పాటు అంటే 59 యేళ్లకు పెంచింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
 
ఇది ప్ర‌భుత్వంలో ప‌నిచేసే ఉద్యోగులు, ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు, గ‌వ‌ర్న‌మెంట్ ఎయిడెడ్ పాఠ‌శాల ఉపాధ్యాయులు, ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో ప‌నిచేసే అంద‌రూ ఉద్యోగుల‌కు రిటైర్మెంట్ వ‌య‌స్సు పెంచుతున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది. 
 
ఈ ఉత్త‌ర్వులు వెంటనే అమ‌లులోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను మాత్రం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం చెప్ప‌లేదు. కాగా, జయలలిత చనిపోయిన తర్వాత సీఎం పగ్గాలు చేపట్టిన ఎడప్పాడి కె పళనిస్వామి అనేక ప్రజాసానుకూల నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగిపోతున్నారు.