ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (14:23 IST)

అరియలూరు టపాసుల పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

fire accident
తమిళనాడులోని అరియలూర్‌ జిల్లాలోని టపాసుల పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ పేలుడు సంభవించడానికి గల కారణాలు పూర్తిగా తెలియలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
పేలుడు సంభవించిన సమయంలో కార్మికులు పరిశ్రమ లోపలే పనిచేస్తుండటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 25 మంది మంటల్లో చిక్కుకున్నారు. 
 
మంటల్లో చిక్కుకున్నవారి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. ఈ భారీ పేలుడు కారణంగా పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.