గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 నవంబరు 2024 (15:29 IST)

ప్రేమను అంగీకరించని టీచర్.. క్లాస్ రూమ్‌లో కత్తితో పొడిచిన యువకుడు

murder
తమిళనాడు, తంజావూరులో తన ప్రేమను అంగీకరించని కారణంగా మహిళా టీచర్‌ను కత్తితో పొడిచి చంపేశాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళితే.. తంజావూరు, మల్లిపట్నం ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్తున్న టీచర్ రమణిని కత్తితో పొడిచి హత్య చేసాడు. 
 
తన ప్రేమను టీచర్ అంగీకరించకపోవడంతో స్టూడెంట్ మదన్ కుమార్ హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో వున్న మదన్‌ను పోలీసులు గాలిస్తున్నారు.
 
రెండ్రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన మధన్, అతని కుటుంబ సభ్యులు ఇద్దరికీ పెళ్లి చేయాలని కోరుతూ రమణి ఇంటికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారి పెళ్లి ప్రతిపాదనను రమణి తిరస్కరించడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది.
 
మధన్ ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. కాని రమణి అతనిని వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు రమణిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు. ఉపాధ్యాయురాలి దారుణ హత్య తర్వాత తంజావూరు జిల్లా యంత్రాంగం పాఠశాలకు ఒక రోజు సెలవు ప్రకటించింది.