రోమియో టీచర్‌ : విద్యార్థిని ప్రేమలేఖ

Last Updated: గురువారం, 11 జులై 2019 (13:40 IST)
చెన్నై మహానగరంలో ఓ ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకునే విద్యార్థినికి రాసి కష్టాల్లో చిక్కుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దిండుక్కల్‌ జిల్లా సమీపంలో తరుంబత్తుపట్టి ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ఓ విద్యార్థిని ప్లస్ టూ చదువుతోంది. ఇదే పాఠశాలలో రాజా అశోక్‌కుమార్‌ అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు.

అయితే, విద్యార్థినిపై మనసుపడిన టీచర్.. ఆమెకు ప్రేమలేఖ ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రులు సంఘం సమక్షంలో విచారణ జరిగింది. నివేదికను పాఠశాల విద్యాశాఖ అధికారులకు పంపించారు. విచారణ అనంతరం జిల్లా ముఖ్య అధికారి శరత్‌కుమార్‌ ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.దీనిపై మరింత చదవండి :