మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (13:16 IST)

ఆన్‌లైన్‌ తరగతులు అర్థం కాలేదు... ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని

కరోనా వైరస్ కారణంగా ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆన్ లైన్ క్లాసుల కోసం విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు లేకుండా... నెట్ లేకుండా నానా తంటాలు పడుతున్నారు. ఇటీవలే స్మార్ట్ ఫోన్ కొనిపెట్టలేదని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా ఆన్‌లైన్‌ తరగతులు అర్ధం కాకపోవడంతో బీఈలో చేరిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి సంగిలియాండపురం ప్రాంతానికి చెందిన లత (17) తిరుచ్చి శ్రీమతి ఇందిరాగాంధీ మహిళా కళాశాలలో బీఈ మొదటి సంవత్సరంలో చేరింది. ప్రస్తుతం మొదటి సంవత్సర విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యాబోధన జరుగుతోంది. 
 
ప్లస్‌ టూలో తమిళంలో చదువుకున్న లత ఆన్‌లైన్‌లో ఇంగ్లీషులో బోధన జరుగుతుండడంతో ఆ పాఠాలు ఆమెకు అర్థం కావడం లేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పాలకరై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.