సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జులై 2024 (21:04 IST)

బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ నేత ఆమ్‌స్ట్రాంగ్ దారుణ హత్య.. కత్తులతో వెంటబడి..?

BSP Armstrong Murder
BSP Armstrong Murder
బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆమ్‌స్ట్రాంగ్ దారుణంగా హత్యకు గురైయ్యారు. ఆమ్‌స్ట్రాంగ్‌ను వెంబడించి మరీ దారుణంగా హత్య చేశారు. ఆమ్‌స్ట్రాంగ్‌ను హతమార్చిన దుండగులు పరారిలో వున్నారు. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఈ ఘోరం జరిగింది. ఓ రాజకీయ నేతను వెంటాడి హత్య చేయడం కలకలం రేపింది. 
 
శుక్రవారం రాత్రి చెన్నై, పెరంబూరులోని అతని నివాసం నుంచి బయటికి వచ్చిన ఆయన్ని ఓ గుంపు వెంబడించి హత్య చేసింది. కత్తులతో ఆయనను వెంటాడి తీవ్రంగా గాయపరిచారు. వెంటనే ఆయన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆరుగురితో కూడిన ఓ బృందం ఆమ్‌స్ట్రాంగ్‌పై ఆయుధాలతో దాడి చేసింది. తలకు తీవ్రంగా గాయం కావడంతో ఆమ్‌స్ట్రాంగ్ ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. బహుజన్ సమాజ్‌వాదీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడైన ఆమ్‌స్ట్రాంగ్ రాజకీయ నేతగా మంచి గుర్తింపు సంపాదించారు. కానీ ఆయనపై పలు కేసులు వున్నాయి. ఇప్పటికే రౌడీ గ్యాంగ్‌లతో ఆయన శత్రుత్వం వున్నదని టాక్ వస్తోంది.