ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మే 2023 (19:41 IST)

చైన్ స్నాచర్ నుంచి బంగారాన్ని ఇలా కాపాడుకున్న మహిళ

Chain snatching
కోయంబత్తూరులో ఓ మహిళ చైన్ స్నాచర్ నుంచి తన బంగారాన్ని కాపాడుకుంది. వివరాల్లోకి వెళితే, తమిళనాడు కోయంబత్తూరులోని బీలమేడు ప్రాంతానికి చెందిన కౌసల్య అనే మహిళ జివి రెసిడెన్సీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా ఆమెను కారులో వెంబడించిన అనుమానాస్పద వ్యక్తులు ఆమె మెడలోని గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. 
 
అయితే కౌసల్య చైన్‌ను గట్టిగా పట్టుకుంది. దీంతో ఆ కారు కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ మహిళ కిందపడిపోయింది. ఇదంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు శక్తివేల్, అభిషేక్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. 
 
అనంతరం వారిపై జరిపిన విచారణలో ఇప్పటికే కొన్ని నేరాలకు పాల్పడినట్లు తేలింది. వారిని కోర్టులో హాజరుపరిచి కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు.