1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (12:59 IST)

చాముండీ అమ్మవారి కంట కన్నీరు (video)

మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లో పరిధిలోగల థాన్మండీలో చాముండీ అమ్మవారి ఆలయం ఉంది. ప్రస్తుతం అమ్మవారి కంటి నుంచి కన్నీరు వస్తున్నదన్న వార్తలతో భక్తులు ఆలయానికి పరుగులు తీస్తున్నారు.

అమ్మవారిని దర్శించుకున్నవారంతా దీనిని మహత్మ్యంగా వర్ణిస్తున్నారు. ఇక్కడ సంభవించిన వరదల విపత్తును చూసి అమ్మవారు ఆక్రోశిస్తున్నారని భక్తులు చెప్పుకుంటున్నారు.

మరికొందరైతే రానున్న ఏదో చెడు పరిణామానికి ఇది సంకేతమని అంటున్నారు. ఆలయానికి వచ్చిన మహిళలు భజనలు చేస్తున్నారు.
 
బాలా త్రిపుర సుంద‌రీదేవి
శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా రెండో రోజైన ఆశ్వ‌యుజ శుద్ధ విదియ సోమ‌వారం నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ బాలా త్రిపుర సుంద‌రీదేవిగా సాక్షాత్క‌రిస్తుంది. మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు. ఈ రోజున రెండు నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావించి.. పూజించి కొత్త బ‌ట్ట‌లు పెడ‌తారు. అమ్మ‌వారికి ఆకుప‌చ్చ‌, ఎరుపు, పసుపు రంగు చీర‌లు క‌ట్టి పాయ‌సం, గారెల‌ను నైవేద్యంగా నివేదిస్తారు.