మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (16:51 IST)

పరోటా, ఫ్రైడ్ రైస్ తిని నిద్రపోయాడు.. అంతే ప్రాణాలు కోల్పోయాడు..

Parotta
పరోటా, ఫ్రైడ్ రైస్ తిన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం పాండిచ్చేరిలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..  పుదుచ్చేరి అరియపాళయంకు చెందిన సెల్వరాసు కానన్ సత్యమూర్తి (33) ఐటీలో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
కరోనా లాక్‌డౌన్ కాలం నుండి అతను ఇంటి నుండి పని చేస్తున్నందున, అతను తన భార్యతో కలిసి నిన్న సాయంత్రం పాండిచ్చేరి సుల్తాన్‌పేటలోని ఒక దుకాణానికి వెళ్లి పరోటా, ఫ్రైడ్ రైస్ తిన్నాడు. 
 
అనంతరం రాత్రి పది గంటలకు ఇంటికి వచ్చి పడుకోగా, ఉదయం అతడు ఎంత నిద్రలేపినా మేల్కోలేకపోవడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురై ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అతని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.