టెక్కీని ఫ్లాటుకు రప్పించుకున్నాడు.. రేప్ చేసి ఆ వీడియోను ఆ సైట్లో అప్‌లోడ్ చేశాడు..

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (09:30 IST)

rape victim

టెక్కీపై దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వంచించి తోటి టెక్కీపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా దాన్ని వీడియోగా చిత్రీకరించి.. పోర్న్ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఆరిందమ్ నాథ్(28) సీనియర్ సాప్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ బెంగళూరు నగరంలోని ఈజిపురా ప్రాంతంలోని వివేక్‌నగర్‌లోని ఫ్లాట్‌లో నివాసముంటున్నాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల మహిళ బెంగళూరులో ఉంటూ ఆరిందమ్‌నాథ్‌తో కలిసి సాప్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది. 
 
ఆరిందమ్ 26ఏళ్ల మహిళను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. ఓ రోజు ఫ్లాటుకు రమ్మని.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాన్ని సెల్‌ఫోన్‌తో రహస్యంగా వీడియో తీశాడు. రేప్ వీడియోను పోర్న్ వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరిస్తూ అనేక సార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. డబ్బు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆరిందమ్ రేప్ వీడియోను పోర్న్ సైట్‌లో పెట్టాడు.
 
దీనిపై బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరిందమ్ నాథ్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 384, 506, 66 ఈ, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధిత మహిళా టెకీ ఆత్మహత్యయత్నం చేయగా ఆమె స్నేహితురాళ్లు ఆమెను రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జస్ట్ మొబైల్ గేమ్.. కానీ, అదే మృత్యువుకు రహదారి

బ్లూ వేల్ గేమ్. ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పేరు. ఈ గేమ్ సరదాగా ...

news

భక్తి పేరుతో గుడికి... పెళ్లయిన 3 నెలలకే భర్తను హతమార్చిన భార్య

వివాహేతర సంబంధాలు ఎంతటి దురాగతాలకైనా పాల్పడేలా చేస్తాయి. ఓ వివాహిత పెళ్లయిన మూడు నెలలకే ...

news

యేడాదికి ముందే సత్తా చూపిద్దాం... కేసీఆర్ వ్యూహం... గుత్తాతో రాజీనామా?

సార్వత్రిక ఎన్నికలకు ఒక యేడాది ముందు తమ సత్తా చాటేందుకు తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు ...

news

తెరాస వద్దంది.. బీజేపీ రమ్మంది... అందుకే కాంగ్రెస్‌కు గుడ్‌బై..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అత్యంత కీలక నేతల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకరు. ...