శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (09:45 IST)

తెలుగు ప్రజల్లో దైవ భక్తి ఎక్కువట.. భారత జనాభాలో 0.002 శాతం నాస్తికులే!

తెలుగు ప్రజల్లో దైవ నమ్మకం ఎక్కువని, దేవుని పట్ల వారికి భక్తి ఎక్కువని ఓ అధ్యయనంలో తేలింది. విభజనకు ముందు నిర్వహించిన ఓ సర్వేలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది తాము నాస్తికులమని చెప్పుకున్నారు.

తెలుగు ప్రజల్లో దైవ నమ్మకం ఎక్కువని, దేవుని పట్ల వారికి భక్తి ఎక్కువని ఓ అధ్యయనంలో తేలింది. విభజనకు ముందు నిర్వహించిన ఓ సర్వేలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది తాము నాస్తికులమని చెప్పుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా నాస్తిక వాదాన్ని నమ్మేవారే ఎక్కువున్నారని తేలింది. 2011 జనాభా లెక్కలకు సంబంధించి తాజాగా విడుదలైన నివేదిక ఈ విషయాన్ని తేల్చింది. 
 
దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ తర్వాత నాస్తికులు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 112 మందితో కర్ణాటక, 1,297 మందితో తమిళనాడు, 4,896 మందితో కేరళ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గ్రామీణ ప్రాంతాల్లో 22,828 నాస్తికులు ఉండగా, పట్టణాల్లో 10,476 మంది నాస్తికులు ఉన్నారు. 
 
ఇక దేశంలోని మొత్తం నాస్తికుల్లో 17,597 మంది పురుషులు కాగా 15,707 మంది మహిళలని తాజా నివేదికలో తేలింది. రూ.125 కోట్ల పైచిలుకు భారతీయుల్లో నాస్తికుల సంఖ్య 33,304 మాత్రమేనని తేలింది. అంటే మొత్తం జనాభాలో ఇది 0.002 శాతమని ఆ నివేదిక వెల్లడించింది.