గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (12:43 IST)

టైలర్ హత్య.. ఉదయపూర్‌లో ఉద్రిక్తత.. రాష్ట్రంలో కర్ఫ్యూ

Tailor
Tailor
ఉదయపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. టైలర్ హత్యపై రాజస్థాన్ వ్యాప్తంగా గల పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. టైలర్ హత్యకు సంబంధించి రాజ్సమంద్‌లో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఇంకా ఫాస్ట్ ట్రాక్ కింద సత్వర న్యాయం చేస్తామని సీఎం అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు.
 
వివరాల్లోకి వెళితే.. ఉదయపూర్‌ భూత్మహల్ ప్రాంతంలో మంగళవారం ఒక దర్జీని పట్టపగలే హత్య చేశారు. దీంతో ఆ నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దర్జీలందరూ ఆందోళనకు దిగారు. దీంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆందోళనకారులను శాంతి కోసం విజ్ఞప్తి చేశారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రోడ్డుపై ఆందోళన చేపట్టడంతో నెల రోజుల పాటు నిషేధాజ్ఞలు విధించి, మొబైల్ ఇంటర్నెట్ సేవలను మరో 24 గంటల పాటు నిలిపివేశారు. రాత్రి 8 గంటలకు ఉదయపూర్ నగరంలోని ఏడు పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో కర్ఫ్యూ ప్రకటించారు.
 
ప్రభుత్వ ఫాస్ట్ ట్రాక్ పథకం కింద సత్వర న్యాయం చేస్తామని సీఎం గెహ్లాట్ హామీ ఇచ్చారు. ఇంకా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. 40 ఏళ్ల కన్హయ్య లాల్ అనే దర్జీని తన దుకాణంలో ఇద్దరు దుండగులు హత్య చేశారు.
 
కన్హయ్య సస్పెండ్ అయిన బిజెపి అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్టును ప్రచురించారు. ఆమె ముస్లిం ప్రవక్తకు వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలకు వైరల్ అయిన సంగతి తెలిసిందే. బట్టలు ఆర్డర్ చేసే నెపంతో దుండగులు కన్హయ్య లాల్ దుకాణంలోకి ప్రవేశించారు. ఏం జరుగుతుందని తెలుసుకునే లోపే ..వారు అతనిపై కత్తులతో దాడి చేశారు. అతని శిరచ్ఛేదం చేశారు.
 
నిందితులు తరువాత నేరానికి సంబంధించిన వీడియోలను ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు. ఈ షాకింగ్ వీడియోను పంచుకోవద్దని సీఎం గెహ్లాట్ ప్రతి ఒక్కరినీ కోరినప్పటికీ బాధ్యత తీసుకున్నారు. 
 
ఈ దారుణ హత్య తర్వాత షట్టర్లను కూల్చివేసిన స్థానిక దుకాణదారులు ఆందోళన చేపట్టారు. ఈ ప్రాంతంలో భారీగా పోలీసు మోహరింపుకు ఆదేశించారు. బాధితుడి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
 
ఈ నేరాన్ని "ఊహకు అందని క్రూరమైనది" అని సిఎం అభివర్ణించారు. ఉదయపూర్‌లో మత సామరస్యాన్ని కాపాడటానికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు. దీనిపై రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియాతో మాట్లాడానని వెల్లడించారు.