శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 నవంబరు 2020 (19:40 IST)

ఆ మట్టి దీపం 24 గంటలు పాటు వెలుగుతుంది (video)

చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కుమ్మరి ఓ మట్టి దీపం చేసి అద్బుతహ అనిపించుకుంటున్నారు. ఆ కుమ్మరి తయారు చేసిన దీపం రోజంతా అంటే 24 గంటలు వెలుగుతోంది. దీనికి తోడు మీరు ఒక్కసారి నూనె పోస్తే సరిపోతుంది.

ఈ మ్యాజిక్‌ లాంతరర్‌ రూపశిల్పి పేరు అశోక్‌ చక్రధారి. నివసించేదీ చత్తీస్‌గఢ్‌లోని కొండగావ్‌ అనే చిన్న గ్రామంలో. ప్రస్తుతం అశోక్‌ తయారు చేస్తున్న దీపాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో అశోక్‌కు ఈ దీపాల ఆర్డర్లు పెరిగాయి. ఈ దీపం సుమారు 24 గంటల నుండి 40 గంటల పాటు నిరంతరాయంగా వెలుగుతుందని అశోక్‌ చెప్పారు.

ఈ మట్టి దీపాల్లో...నూనె కూడా ఆటోమేటిక్‌గా ప్రసారం జరుగుతుంది. చూసేందుకు చాలా ఆసక్తితో ఉన్న ఈ దీపాలను తయారు చేయాలన్న ఆలోచన..యూట్యూబ్‌లో ఓ వీడియో చూశాకే పుట్టిందని చెబుతున్నారు అశోక్‌చక్రధారి.