ఆ వార్తలు నిజమే.. కరోనాపై విశాల్ క్లారిటీ
తన కుటుంబంలోకి కరోనా జొరబడిందంటూ రేగుతున్న వార్తలపై హీరో విశాల్ క్లారిటీ ఇచ్చారు. కోలీవుడ్‌లో అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన కొందరికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. తాజాగా హీరో విశాల్ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ అంటూ కోలీవుడ్‌లో వార్తలు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. విశాల్ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
‘‘ఆ వార్తలు నిజమే. మా నాన్నకి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఆయనకి సహాయం చేసే క్రమంలో నాకు కూడా జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి.
అలాగే ఇవే లక్షణాలు నా మేనేజర్‌లో కూడా ఉన్నాయి. మేమంతా ఆయుర్వేదిక్ మెడిసెన్ తీసుకుంటున్నాము. ఒక వారంలో ప్రమాదం నుంచి బయటపడతాము. ప్రస్తుతానికి మా ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. గుడ్ బై..’’ అని విశాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.