శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 16 జూన్ 2021 (08:14 IST)

తనను విడిచి వెళ్లిందనీ... భార్య అశ్లీల చిత్రాలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన భర్త

భార్య అశ్లీల చిత్రాలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన నీచుడైన భర్తకు పోలీసులు అరదండాలు వేసిన ఘటన నోయిడా నగరంలో వెలుగుచూసింది. గురుగావ్ నగరానికి చెందిన ఓ భర్త పవన్ ధడ్కన్ అనే మారుపేరుతో ఫేస్ బుక్ ఖాతా ప్రారంభించాడు.

గురుగావ్ వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన మహిళ (28)తో 2010లో వివాహమైంది. వీరు గురుగావ్ లో నివశించేవారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త తరచూ భార్యను కొడుతుండటంతో ఆమె ఇంటిని వదిలి విడిగా జీవిస్తూ నోయిడాలోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తోంది..
 
భార్య తనను వదిలి వెళ్లిందనే కోపంతో పవన్ ధడ్కాన్ పేరుతో ఫేస్  బుక్ అకౌంట్ తెరచి భార్య అశ్లీల చిత్రాలను అవమానకరమైన శీర్షికలతో పోస్టులు చేశాడు.

భార్య ఫిర్యాదుతో పోలీసులు భర్తను అరెస్టు చేసి,ఆయన ఐటీ, ఐపీసీ 377,498 ఎ, 506,509 సెక్షన్ల కింద కేసు పెట్టారు. నిందితుడైన భర్తను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు