ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (08:03 IST)

ముంబైలో 24 గంటలూ మాల్స్ ఓపెన్: కేబినెట్ ఆమోదం

ముంబైలో మాల్స్, హోటళ్లు, మల్టీప్లెక్స్‌లు వంటివి 24 గంటలూ తెరిచి ఉంచాలన్న ప్రతిపాదనకు మహారాష్ట్ర సర్కార్ లైన్ క్లియర్ చేసింది. బుధవారం ఉదయం సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఈ ప్రపోజల్‌కు ఆమోదం తెలిపింది. జనవరి 27 నుంచి ఈ నిర్ణయం అమలు చేయాలని మంత్రిమండలిలో తీర్మానం చేసింది.
 
ముంబై 24X7 పేరుతో స్టార్ట్ చేస్తున్న ఈ విధానాన్ని సిటీ మొత్తం అమలు చేయడంలేదని తెలిపారు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే. బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నారిమన్ పాయింట్ సహా పలు నాన్ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో మాత్రమే మాల్స్, మల్టీపెక్స్‌లు, హోటళ్లు 24 గంటలు తెరిచి ఉంటాయన్నారు.

అయితే ఇలా తెరవాలా వద్దా అన్నదానిపై బలవంతం ఏమీ లేదని, ఆయా సంస్థల యజమానుల ఇష్టమని చెప్పారు ఆదిత్య థాక్రే. 24 గంటలూ మాల్స్, హోటల్స్ వంటివి ఓపెన్ చేసి ఉంచడం వల్ల సిటీకి వచ్చే పర్యాటకులకు, వ్యాపారులకు కూడా మేలు జరుగుతుందన్నారు.