సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (18:35 IST)

అక్కమొగుడిని బుట్టలో వేసింది: నడిరోడ్డుపై కొట్టుకుంటున్న అక్కాచెల్లెళ్లు

అక్కమొగుడిని బుట్టలో వేసుకుంది. ఫలితంగా అక్కాచెల్లెళ్లిద్దరూ నా మొగుడంటే నా మొగుడు అని నడిరోడ్డుపై చితక్కొట్టుకున్నారు. అలా రోడ్డుపై కొట్టుకుంటున్న మహిళలను చూసి స్థానికులు వారించే ప్రయత్నం చేసారు. చివరికి పోలీసుల ఎంట్రీతో విషయం స్టేషనుకు వెళ్లింది.
 
అసలు ఏం జరిగిందంటే? ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీలోని గంగ్నహర్ పోలీసు స్టేషను పరిధిలో వెస్ట్ అంబర్ తలాబ్ నివాసి అయిన మహిళకి పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి నలుగురు కుమార్తెలు కలిగారు. ఐతే నాలుగేళ్ల నుంచి భర్త ప్రవర్తనలో మార్పు గమనించింది భార్య. చివరికి భర్త ద్వారా ఆమె తెలుసుకున్నది ఏమిటంటే.. అతడు మరో స్త్రీతో రిలేషన్ కొనసాగిస్తున్నాడని.
 
ఆ తర్వాత ఆమెకి మరింత షాక్ తినే విషయం ఏంటంటే.. ఆమె ఎవరో కాదు తన సొంత చెల్లెలు. నాలుగేళ్లుగా తన కళ్లుగప్పి బావతో చెల్లెలు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో అతడితో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక తనకు లైన్ క్లియర్ అయిందనుకున్న సదరు భర్త, ఏకంగా భార్య చెల్లిని తీసుకుని మీరట్లో వేరే ఇంట్లో కాపురం పెట్టేశాడు.
 
ఇది కాస్తా భార్యకు తెలియడంతో నేరుగా ఆ ప్రాంతానికి వచ్చింది. బైకుపై తన భర్తతో వెళ్తున్న చెల్లిని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డగించింది. ఆ తర్వాత జుట్టు పట్టుకుని నా భర్తనే వలలో వేసుకుంటావా అంటూ దాడి చేయడం మొదలుపెట్టింది. ఆమె చెల్లెలు కూడా తన అక్కపై తిరగబడి... అతడు నా భర్త అంటూ కలబడింది. గొడవను చూసి పోలీసులు అక్కడికి రాగానే అక్కాచెల్లెళ్లను అలాగే చూస్తూ వున్న భర్త, వాళ్లిద్దరూ తన భార్యలు అంటూ సెలవిచ్చాడు. దీనితో ముగ్గుర్నీ పోలీసు స్టేషనుకి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేసారు పోలీసులు.