గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (07:42 IST)

రూపే, యూపీఐ ట్రాన్సాక్షన్స్‌‌కి ఎండీఆర్ ఛార్జీలు లేవిక

రూపే, యూపీఐతో జరిపే లావాదేవీలకు మర్చెంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్‌‌‌‌) ఫీజును ఎత్తివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌ల(పీఎస్‌‌బీల) టాప్ ఎగ్జిక్యూటివ్‌‌లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన రోజే దీన్ని ప్రకటించారు.

జనవరి నుంచి రూ.50 కోట్లకు పైన యాన్యువల్ టర్నోవర్ కలిగిన అన్ని వ్యాపారాలు, తప్పనిసరిగా రూపే, డెబిట్ కార్డు, యూపీఐ క్యూఆర్‌‌ కోడ్‌‌ ద్వారా చెల్లింపులు జరిపేలా ఫెసిలిటీని అందించాలని డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ రెవెన్యూ స్పష్టం చేసింది.

ఈ లావాదేవీలకు జనవరి నుంచి ఎండీఆర్  ఫీజు ఉండదని పేర్కొంది. కస్టమర్ల నుంచి డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్‌‌ను యాక్సప్ట్ చేసినందుకు ఎండీఆర్‌‌‌‌ ఫీజును మర్చెంట్ బ్యాంక్‌‌లకు చెల్లించాల్సి ఉంటుంది.‌‌
 
మూడు పార్టీలకూ వాటా
ప్రతి లావాదేవీపై మర్చెంట్ చెల్లించే మొత్తాన్ని, ముగ్గురు స్టేక్ హోల్డర్స్ పంచుకుంటారు. లావాదేవీకి సాధ్యమయ్యేలా చేసినందుకు బ్యాంక్‌‌లు, పీఓఎస్ మెషీన్‌‌ను ఇన్‌‌స్టాల్ చేసినందుకు వెండార్, కార్డు నెట్‌‌వర్క్ ప్రొవైడర్ వీసా లేదా మాస్టర్‌‌‌‌ కార్డులు ఈ ఫీజులను పంచుకుంటాయి. క్రెడిట్ కార్డులపై ప్రస్తుతం ఎండీఆర్ ఛార్జీలు లావాదేవీ మొత్తం బట్టి జీరో నుంచి 2 శాతం వరకు ఉన్నాయి.

రూ.50 కోట్లకు పైన యాన్యువల్ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు, తమ కస్టమర్లకు  పేమెంట్ల కోసం లో కాస్ట్ డిజిటల్ విధానాలను ఆఫర్ చేయాలని నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్‌‌లోనే చెప్పారు. బ్యాంక్‌‌లు, ఆర్‌‌‌‌బీఐ ఈ లావాదేవీల ఖర్చును భరించాలని పేర్కొన్నారు. సీతారామన్ తన రెండో బడ్జెట్‌‌ను 2020 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.