Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

50 కిలోమీటర్లు.. పది గంటలు.. తల్లి మృతదేహంతో జవాను నడక..

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (09:14 IST)

Widgets Magazine

దేశరక్షణ కోసం పాటుపడే ఓ వీర జవానుకు చేదు అనుభవం మిగిలింది. పఠాన్ కోట్‌లో జవానుగా పనిచేస్తున్న మహ్మద్ అబ్బాస్ తల్లి నాలుగు రోజుల క్రితం మరణించింది. మాతృమూర్తికి సొంతూరైన కర్మాలోనే అంత్యక్రియలు నిర్వర్తించాలనేది అబ్బాస్‌ కోరిక. కానీ అక్కడ అంత్యక్రియలు నిర్వహించాలంటే.. 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఏదైనా వాహనంలో వెళ్దామనుకుంటే వాతావరణం సహకరించదు. రోడ్డుపై ఆరు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. 
 
ఇక చేసేది లేక మృతదేహాన్ని తరలించేందుకు హెలికాప్టర్ సిద్ధం చేస్తామని కుప్వారా జిల్లా అధికారులు మాటిచ్చారు. నాలుగు రోజులైనా దాని జాడ లేకపోవడంతో తల్లి మృతదేహాన్ని భుజానేసుకొని సొంతూరుకు బయలు దేరాడు. పదిగంటలు నడిచి అక్కడికి చేరుకున్నాడు.
 
అధికారుల తీరుతో తన తల్లికి సరైన రీతిలో అంత్యక్రియలు నిర్వహించలేకపోయానని అబ్బాస్‌ విలపించాడు. అయితే.. హెలికాప్టర్‌ను సిద్ధం చేశామని, వాతావరణం సరిగా లేకపోవడంతో సాయం పొందేందుకు అబ్బాస్‌ కుటుంబ సభ్యులు తిరస్కరించారని అంటున్నారు. కానీ వాదనను అబ్బాస్ కొట్టిపారేశాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెళ్ళికి అంతా సిద్ధం.. తాళికట్టాల్సిందే తరువాయి.. వరుడు జంప్.. ఎందుకంటే?

పెళ్ళికి అంతా సిద్ధం అయితే పీటలపై కూర్చున్న వరుడు తాళి కట్టే సమయంలో వధువు నచ్చలేదని ...

news

వెంకయ్యాజీ.. బడ్జెట్‌పై సంతృప్తి లేదా : అరుణ్ జైట్లీ ప్రశ్న

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ నుంచి ఓ వింతైన ప్రశ్న ...

news

మిస్టర్ ట్రంప్... నేను టెర్రరిస్టునా? సిరియా చిన్నారి సూటి ప్రశ్న... వైరల్‌గా మారిన బాలిక ట్వీట్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సిరియాకు చెందిన ఓ ముస్లిం చిన్నరి సూటిగా ఓ ప్రశ్న ...

news

అమెరికా బాటలో కువైట్.. పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం దేశాలపై నిషేధం

అమెరికా బాటలో కువైట్ నడవనుంది. పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం మెజారిటీ దేశాలపై కువైట్ ...

Widgets Magazine