మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (14:21 IST)

ప్రాణం తీసిన టిక్ టాక్ వీడియో... తూటా పేలింది.. అంతే..?

టిక్ టాక్ వీడియో ఓ ప్రాణం తీసింది. తుపాకీతో టిక్ టాక్ వీడియో వీడియో చేస్తుండగా అది పేలి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఇండోర్, పరదేశి పురా ప్రాంతంలో ఒక వైన్ షాపులో సుశీల్, మనీష్ అనే ఇద్దరు యువకులు పనిచేస్తున్నారు. వారిద్దరూ కలిసి టిక్ టాక్ వీడియో చేయాలనుకున్నారు.  తెలిసిన ఒక సెక్యూరిటీ గార్డు మిత్రుడి వద్ద తుపాకీ తీుసుకున్నారు. ఆ తరువాత వైన్ షాపు వద్ద వీడియో తీస్తున్నారు.
 
అయితే తుపాకీ లోడెడ్ ఉందని గమనించక మనీష్ దాని ట్రిగర్ నొక్కాడు. దాంతో బులెట్ ఎదురుగా ఉన్న సుశీల్ కు తగిలడంతో అతను ఒక్కసారిగా కుప్పకూలాడు. దాంతో అతన్ని సుశీల్ ను ఆస్పత్రికి తరలించగా అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు మనీష్‌ని అరెస్టు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేశారు.