అయోధ్య రామాలయంలో అద్భుతం.. 2వేల అడుగుల లోతులో..?
అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజను ఆగస్టు 5వ తేదీన నిర్వహించబోతున్నారు. ఈ భూమి పూజకు ప్రధాని మోడితో పాటుగా బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, దేశంలోని ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నారు. భూమిపూజ కోసం దేశంలోని ప్రముఖ దేవాలయాలు, గురుద్వారాలు, బౌద్ధారామాలు, జైనమందిరాల నుంచి మట్టిని, పవిత్రజలాలను తీసుకొస్తున్నారు.
అయితే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన చరిత్ర, దాని పుట్టుపూర్వోత్తరాలు, వివాదాలు, కోర్టు కేసులు ఇతర వివరాలను తెలియజేస్తూ టైమ్ క్యాప్సూల్‌ను తయారు చేస్తున్నారు. ఈ టైమ్ క్యాప్సూల్‌ను అయోధ్య రామాలయం కింద 2000 అడుగుల లోతులో భద్రపరచబోతున్నారు.
భవిష్యత్తులో ఏవైనా వివాదాస్పదమైన విభేదాలు జరిగినపుడు టైమ్ క్యాప్సూల్ ద్వారా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. వివరాలను తామ్రపత్రంపై లిఖించి జాగ్రత్తగా భద్రపరుస్తున్నట్టు రామాజన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కమలేశ్వర్ తెలిపారు.