ప్రేయసికి డబ్బివ్వలేదని.. తల్లిదండ్రులను, సోదరిని చంపేసిన దుర్మార్గుడు.. రాత్రంతా శవాలతో గడిపాడు..

బుధవారం, 30 నవంబరు 2016 (10:04 IST)

faction murder

ప్రియురాలు అడిగిన డబ్బు ఇవ్వలేదని తల్లిదండ్రులపై అలిగిన ఓ యువకుడు మద్యం తాగి తల్లిదండ్రులను గొంతు కోసి హతమార్చిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపత్తూరులో సమీపంలోని కాక్కంగరైలో విద్యుత్తు సంస్థ ఉద్యోగి మోహన్‌, ఆయన భార్య రాజేశ్వరి, వారి కుమార్తె సుకన్య సోమవారం ఉదయం దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. మోహన్‌ కుమారుడు తమిళరసన్‌ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 
ఈ కేసులో తమిళరసన్‌ నిందితుడని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. విచారణలో తమిళరసన్ పలు అంశాలు వెల్లడించారు. హోసూర్‌లో తమిళరసన్ పనిచేస్తున్న సమయంలో సహోద్యోగిని ప్రేమించాడు. ఆమె కోసం కుటుంబసభ్యులకు తెలియకుండా రూ. లక్షలు ఖర్చుచేశాడు. మరో రూ. 2 లక్షలు అవసరమని ఆమె అడిగింది. ఆ మొత్తం ఇవ్వాలని తన తల్లిదండ్రులను తమిళరసన్‌ కోరాడు.
 
యువతి విషయం తెలిసిన సుకన్య సదరు వివరాలను కన్నవారికి చెప్పింది. దీంతో తమిళరసన్‌కు డబ్బులు ఇవ్వలేదు. ఆగ్రహంతో బయటకు వెళ్లిన తమిళరసన్‌ ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి తిరిగొచ్చాడు. అప్పుడు తల్లితో వాగ్వివాదానికి దిగాడు. దీనికి కారణం సుకన్య కావడంతో ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డుకున్న తల్లిని కూడా గొంతు కోసి హతమార్చాడు. 
 
ఇద్దరి మృతదేహాల వద్దే రాత్రంతా గడిపాడు. భార్య, కుమార్తె రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉండటం చూసి మోహన్ విలపించాడు. పోలీసులకు తనను అప్పగిస్తాడనే భయంతో తమిళరసన్‌ ఆయన తలపై బండరాయి వేసి, కత్తితో గొంతు కోసి చంపాడు.
 
ఆ సమయంలో మోహన్‌ అరుపులు విన్న ఇరుగుపొరుగు వచ్చేలోపు తమిళరసన్‌ కత్తితో గాయపరచుకుని స్పృహ కోల్పోయినట్లు నటించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి తమిళరసన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చికాగో జైలులో వింత ఘటన.. లాకప్‌లో లాక్ అయ్యాడు.. 6లక్షల డాలర్ల నష్టపరిహారం పొందాడు..

అమెరికా దేశంలోని చికాగో జైలులో వింత ఘటన చోటుచేసుకుంది. కుమారుడిని చూసేందుకు విజిటర్‌గా ...

news

అన్న-సోదరి ప్రేమ: శారీరకంగా కలిశారు.. గర్భం దాల్చిన సోదరికి విషపు ఇంజెక్షన్ వేసి పారిపోయాడు..

మానవీయ విలువలు మంటగలిసిపోయాయి. వావివరుసలు కనుమరుగవుతున్నాయి. తాజాగా అన్న-సోదరి మధ్య ...

news

మైనర్ కుర్రాడి చేతి వేళ్ళను తొలగించిన వైద్యుడికి రూ.4.5లక్షల జరిమానా

ఓ మైనర్ కుర్రాడి చేతి రెండు వేళ్ళను అతని తల్లిదండ్రుల అనుమతి లేకుండా తొలగించిన వైద్యుడి ...

news

పొడవు కావాలని కాళ్లకు ఆపరేషన్.. నిఖిల్ రెడ్డి వాకర్ లేకుండా నడుస్తున్నాడోచ్..

పొడవు కావాలని కాళ్లకు ఆపరేషన్ చేయించుకొని, ప్రస్తుతం మంచానికే పరిమితమైన సాఫ్టువేర్ ...