Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కాంగ్రెస్ దొంగే... బీజేపీ అంతకుమించిన గజదొంగ : హార్దిక్ పటేల్

మంగళవారం, 24 అక్టోబరు 2017 (17:42 IST)

Widgets Magazine
hardik patel

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల తేదీలను వెల్లడించాల్సి ఉండగా, ఎన్నికల సంఘం జాప్యం చేస్తోంది. దీనిపై రాజకీయ దుమారం చెలరేగివుంది. ఈ క్రమంలో పటీదార్ ఉద్యమ సంచలనం హార్దిక్ పటేల్ తాజాగా మరోసారి నోటికి పనిచెప్పారు. 'పెద్దదొంగ' బీజేపీని గద్దెదించడం కోసం 'చిన్నదొంగ' కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
ఉత్తర గుజరాత్‌లోని మందల్‌లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 'కాంగ్రెస్ దొంగే... కానీ బీజేపీ అంతకు మించిన గజదొంగ. అందుకే గజదొంగను ఓడించేందుకు దొంగకి మద్దతు ఇవ్వాల్సి వస్తే.. మేము అందుకు సిద్ధం. అయితే ఇక్కడ కొంత సంయమనం పాటించాలి. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌కు మద్దతివ్వం...' అంటూ వ్యాఖ్యానించారు. 
 
అదేసమయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో తాను సమావేశమైనట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను రాహుల్ గాంధీ బసచేసిన ఉమ్మెద్ హోటల్‌లోనే ఉన్నప్పటికీ.. రాహుల్‌ని కలుసుకోలేదని వివరించారు. అయితే బీజేపీ వాళ్లు మాత్రం గుజరాత్ మొత్తం తమ సొత్తు అయినట్టు సీసీటీవీ వీడియోలతో హడావిడి చేస్తున్నారంటూ మండిపడ్డారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తిరుపతిలో చిరుత కలకలం.. కుక్కను చంపి...

తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో ఒక చిరుతపులి బోనులో చిక్కింది. కపిలతీర్థం సమీపంలో ఏర్పాటు ...

news

రాజధాని అంటే సినిమా సెట్టింగ్ కాదు.. : ఐవైఆర్ కృష్ణారావు ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఎండీ ...

news

ఆంధ్రప్రదేశ్‌కు విజయా బ్యాంకు 2 వేల కోట్ల ఋణం మంజూరు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయా బ్యాంకు 2 వేల కోట్ల రూపాయల ఋణం మంజూరు చేసింది. ఈ ...

news

ఇంట్లో కుక్క.. పంది... బర్రెలు ఉన్నాయా.. అయితే పన్ను చెల్లించాల్సిందే.. ఎక్కడ?

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ...

Widgets Magazine