ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2023 (10:35 IST)

ధరలు పైపైకి... రూ.200లకు చేరిన టమాటా..

tomatos
చెన్నైలోని కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్‌లో టమోటాల సరఫరా తగ్గడంతో సోమవారం నగరంలో టమాటా హోల్‌సేల్ ధరలు రూ.20 పెరిగి కిలో రూ.180కి విక్రయిస్తున్నారు. రిటైల్ షాపుల్లో కిలో రూ.200లకు పైగా టమాటా విక్రయిస్తున్నట్లు సమాచారం. 
 
గత వారం టమాట ధర కొంతమేర తగ్గింది. దీని ప్రకారం జూలై 24న కోయంబేడు హోల్ సేల్ మార్కెట్‌లో కిలో టమాట రూ.70 నుంచి రూ.100 వరకు విక్రయించారు. ఆ తర్వాత మళ్లీ టమాట ధరలు పెరగడం మొదలైంది. ఆదివారం కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో టమాటా రూ.160కి విక్రయించారు. 
 
కోయంబేడు హోల్‌సేల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ పి సుకుమారన్‌ మాట్లాడుతూ.. 'కోయంబేడు హోల్‌సేల్‌ మార్కెట్‌ ప్రారంభమై 27 ఏళ్లు అవుతున్నా, టమాట ధరలు కిలో రూ.200కి చేరడం ఇదే తొలిసారి. మేము ఎప్పుడూ సరఫరాలో పెద్ద కొరతను ఎదుర్కోలేదు. 
 
ప్రస్తుతం, ఏపీ, కర్ణాటక నుండి మార్కెట్‌కు 200 నుండి 250 టన్నుల టమోటాలు మాత్రమే వస్తున్నాయి. జూలై 20 నుండి రేట్లు తగ్గుతాయి. కాని వాతావరణ పరిస్థితుల్లో ఆకస్మిక మార్పు పంట సాగులో 50 శాతం దెబ్బతింది.