మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 మే 2023 (09:11 IST)

కేరళ డబుల్ డెక్కర్ టూరిస్ట్ బోట్ బోల్తా- 18మంది మృతి

Boat
Boat
కేరళలోని తానూర్‌లోని బీచ్ సమీపంలో డబుల్ డెక్కర్ టూరిస్ట్ బోట్ బోల్తా పడింది. ఈ ఘటనలో 18మంది ప్రాణాలు కోల్పోయారు. బోటులో రద్దీ ఎక్కువగా ఉందని, చాలా మంది ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు లేవని ప్రాణాలతో బయటపడిన వారు ఆరోపించారు.
 
తానూర్ సమీపంలోని తూవల్ తీరం ఒట్టుపురం బీచ్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రెస్క్యూ ఆపరేషన్‌లు ఆలస్యం కావడంతో కొంతమంది ప్రయాణికులు పడవలో చిక్కుకున్నారు.