శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (07:57 IST)

రిలయన్స్ జియోకు ట్రాయ్ భారీ షాక్: సమ్మర్ సర్‌ప్రైజ్ రద్దు

కోట్లాదిమంది ఇంటర్నెట్ వినియోగదారులను గంపగుత్తగా తన గుప్పిట్లోనే పెట్టుకోవాలనుకున్న రిలయన్స్ జియోకు, ట్రాయ్ భారీ షాక్ ఇచ్చింది. 15 రోజుల పాటు పొడిగించిన జియో ప్రైమ్ ప్లాన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని గురువారం ఆదేశించింది. అలాగే మూడు నెలల సమ్మర్ సర

కోట్లాదిమంది ఇంటర్నెట్ వినియోగదారులను గంపగుత్తగా తన గుప్పిట్లోనే పెట్టుకోవాలనుకున్న రిలయన్స్ జియోకు,  ట్రాయ్ భారీ షాక్ ఇచ్చింది. 15 రోజుల పాటు పొడిగించిన జియో ప్రైమ్ ప్లాన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని గురువారం ఆదేశించింది. అలాగే మూడు నెలల సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్‌ను కూడా వెనక్కి తీసుకోవాలని రిలయన్స్‌ జియోకు సూచించింది. దీనిపై స్పందించిన రిలయన్స్ జియో, ట్రాయ్ ఆదేశాలను తాము గౌరవిస్తామని ప్రకటించి వెనక్కు తీసుకుంది. ఇప్పటికే ఎన్‌రోల్ అయిన వారికి పథకం వర్తిస్తుందని జియో తెలిపింది. 
 
ఇటీవల ప్రకటించిన ‘జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌’ పొడిగింపు నిర్ణయాన్ని, రూ.303కే 3 నెలల పాటు ఇచ్చే కాంప్లిమెంటరీ ఆఫర్‌ను వెనక్కితీసుకోవాలని రిలయన్స్‌ జియోకు ట్రాయ్‌ సూచించింది. ట్రాయ్‌ ఆదేశాలతో పూర్తిగా ఏకీభవిస్తామని జియో ప్రకటించింది. కొద్ది రోజుల్లోనే ట్రాయ్‌ సూచనలు పాటిస్తామని జియో పేర్కొంది. ఇది వరకే ‘సమ్మర్‌ సర్‌ప్రైజ్‌’ రీచార్జ్‌ చేసుకున్నవారికి మాత్రం ఈ ఆఫర్‌ వర్తిస్తుందని జియో ఓ ప్రకటనలో పేర్కొంది.
 
గురువారం జియో అధికారులతో సమావేశమయ్యాక టెలికా రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ వంటి రిలయెన్స్ జియో ప్రత్యర్థులకు పెద్ద ఉపశమనం కలిగించింది. జియో ఇప్పటికే ప్రకటించి ఘన విజయం సాదించిన రెండు ఆపర్లతో ఈ కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ తాజా పరిణామంతో టెలికాం ధరల్లో హేతుబద్దత మరికొన్ని నెలల్లో పునరుద్ధరించబడుతుందని ఈ కంపెనీలు ఆశాభావం ప్రకటించాయి.
 
వినియోగదారులంతా మార్చి 31లోపు జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకోవాలని గతంలో జియో కోరింది. మెంబర్‌షిప్‌ తీసుకుంటేనే జియో అందిస్తున్న సదుపాయాలు వర్తిస్తాయని పేర్కొంది. మార్చి 31న జియో వెబ్‌సైట్‌, యాప్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా చాలా మంది జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను పొందలేకపోయారు. దీంతో వినియోగదారుల ఒత్తిడి మేరకు ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను 15రోజులపాటు పొడిగిస్తున్నట్లు జియో ప్రకటించిది. అంతేకాకుండా కేవలం రూ.303కే మూడు నెలలపాటు ఉచిత కాలింగ్‌, రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చని కొత్త ఆఫర్‌ను ప్రకటించి మరింత మందిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
 
ట్రాయ్ సలహాను తుచ తప్పకుండా పాటిస్తానని జియో ప్రకటించింది. వీలైనంత త్వరలో అంటే మరి కొద్ది రోజుల్లో జియో సమ్మర్ సర్‌ప్రైజ్ పేరిట ప్రకటించిన 3 నెలల ఉచిత ప్రయోజనాలను రద్దు చేసుకుంటామని కంపెనీ పేర్కొంది. బహుశా వచ్చే 24-48 గంటల్లో ఈ ఆఫర్ ముగిసిపోతుందని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనను రద్దు చేయడానికి ముందుగా తాజా ప్లాన్‌ను తీసుకున్నవారికి మాత్రం 3 నెలల ఉచిత పథకం వర్తిస్తుందని జియో తెలిపింది.