శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (13:47 IST)

భార్యతో రౌడీ వివాహేతర సంబంధం.. భర్త ఏం చేశాడో తెలుసా?

తిరుచ్చిలో భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన ఓ రౌడీ తలపై బండరాయి వేసి చంపేశాడు.. ఓ భర్త. ప్రస్తుతం అతడు పోలీసులు అదుపులో వున్నాడు.


వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి, సమయపురం సమీపంలోని మాకాళిక్కుడి గ్రామానికి చెందిన ఆనందన్.. ఓ రౌడీ. ఇతనిపై పలు కేసులు వున్నాయి. ఇందులో హత్య కేసు కూడా ఒకటి వుంది. 
 
చాలామంది అమ్మాయిల జీవితాలను సర్వనాశనం చేసిన ఈ రౌడీ.. ఇటీవల ఓ వివాహితతో అక్రమసంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసి వివాహిత భర్త ఆనందన్ హెచ్చరించాడు. అయినప్పటికీ రౌడీ ఏమాత్రం తగ్గకుండా.. ఆనందన్ భార్యతో రాసలీలలు కొనసాగించాడు.

దీంతో ఆవేశానికి గురైన ఆనందన్.. నిద్రిస్తున్న రౌడీ తలపై బండరాయి వేసి హతమార్చాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.