మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (18:09 IST)

త్రిపుర అసెంబ్లీ.. అడల్ట్ కంటెంట్ చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఎమ్మెల్యే

Tripura
Tripura
త్రిపుర అసెంబ్లీలో మొబైల్‌లో అడల్ట్ కంటెంట్ చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఎమ్మెల్యే పట్టుబడ్డారు. త్రిపురలోని బగ్‌బస్సా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ అసెంబ్లీ సెషన్‌లో తన మొబైల్ ఫోన్‌లో అసభ్యకరమైన కంటెంట్‌ను చూస్తూ పట్టుబడ్డారు. ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. 
 
వెనుక నుండి ఎవరో ఈ వీడియోను తీశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు శాసనసభ్యుడు తన ఫోన్‌లో అభ్యంతరకరమైన వీడియో ఫీడ్‌ల ద్వారా స్క్రోలింగ్‌కు గురయ్యారు. రాష్ట్ర బడ్జెట్ అంశాలపై చర్చ సందర్భంగా మార్చి 27న ఈ ఘటన జరిగినట్లు సమాచారం.