బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (09:10 IST)

ఆంధ్రా టెక్కీపై బెంగుళూరులో నైజీరియన్ల అత్యాచారం

ఐటీ రాజధాని బెంగుళూరులో మరో మహిళా టెక్కీ అత్యాచారానికి గురైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగినిపై బెంగళూరులో అత్యాచారం జరిగింది. బాధితురాలు రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
 
వీరిని నైజీరియాకు చెందిన అబుజి ఉబాకా, టోనీలుగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, నిందితుల అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను నైజీరియా రాయబార కార్యాలయానికి పంపినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి వివరాలు వెల్లడించని పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆమెను ఆసుపత్రికి పంపినట్టు తెలిపారు. ఈ టెక్కీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సివుంది.